Errabelli Dayakar Rao: ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే..! : మంత్రి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంటు కావాలా? మీరే తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 29 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Errabelli Dayakar Rao: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని తెలంగాణ మంత్రి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కష్టాలు తప్పవని అన్నారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోందని.. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంట్ ఇచ్చే బిఆర్ ఎస్ కావాలో మీరే తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారని..అయితే ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయన అన్నారు. మీ కష్టాల్లో సుఖాల్లో కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మంత్రి దయాకర్ రావు. ఈ సందర్భంగా తండావాసులు సంప్రదాయ పద్ధతుల్లో రెడీ అయ్యారు. డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి మంత్రికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాకముందు కనీస సదుపాయాలు లేక తండా ప్రజలు త్రీవ ఇబ్బందులు పడ్డారని మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తండా ప్రజల కష్టాలను కేసీఆర్ తీర్చారని ఆయన కీర్తించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చారని అన్నారు. మంచినీటి కోసం కిలోమీటర్లు పోయే బాధ తప్పిందని అన్నారు. సాగునీటితోపాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్ ది అయితే, అదే ఎస్టీ లలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మంత్రి దయాకర్ రావు అన్నారు. మీ దగ్గరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ..మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలని అన్నారు. ఏ రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తామని ప్రకటిస్తున్నారని.. అయితే ఎక్కడా లేని హామీలు ఇస్తామంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అంటూ కొనియాడారు. Also Read: తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరుగలేదు #janagama #cm-kcr #errabelli-dayakar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి