Aryan Khan: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డేటింగ్..? వీడియో వైరల్

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసితో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ నైట్ పార్టీలో కనిపించడం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనంటూ ప్రచారం జరుగుతోంది.

New Update
Aryan Khan: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ తో ఆర్యన్ ఖాన్ డేటింగ్..? వీడియో వైరల్

Aryan Khan: బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆర్యన్ ఖాన్ బ్రెజిలియన్ మోడల్, నటి లారిస్సా బొనేసి డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనేసి డేటింగ్

ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనేసి ఓ నైట్ పార్టీలో కనిపించడం నెట్టింట వైరల్ గా మారింది. గత రాత్రి ఆర్యన్ ఖాన్ తన సోదరి సుహానా ఖాన్ తో కలిసి పార్టీకీ వెళ్లారు. ఆర్యన్ బ్లాక్ టీ-షర్ట్, డెనిమ్ జాకెట్ లో కనిపించగా.. సుహానా థాయ్ స్లిమ్ వన్ పీస్‌లో చాలా బోల్డ్‌గా కనిపించింది. వీరిద్దరూ అక్కడ పాప్స్ కు పోజులిచ్చి లోపలికి వెళ్లారు. అయితే ఈ పార్టీకి నటి లారిస్సా బొనేసి కూడా వచ్చారు. బ్లాక్ బ్యాక్‌లెస్ మినీ వన్ పీస్‌లో స్టన్నింగ్ గా కనిపించింది లారిస్సా. ఇక ఆర్యన్ ఖాన్, లారిస్సా బొనేసి ఒకే పార్టీలో కనిపించడంతో.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

publive-image

లారిస్సా బొనేసి తెలుగులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన తిక్క సినిమాలో నటించింది. హిందీలో అక్షయ్ కుమార్ 'దేశీ బాయ్స్', 'గో గోవా గాన్' సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ.

Also Read: OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు