Vijay Devarakonda: లీకైన విజయ్ లుక్.. ప్లీజ్‌ ఆ ఫొటో షేర్‌ చేయొద్దు అంటూ పోస్ట్..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన విజయ్ స్టిల్‌ నెట్టింట వైరలవుతోంది. దీంతో ''డియర్‌ రౌడీ ఫ్యాన్స్‌.. ఆ ఫొటో షేర్‌ చేయొద్దు ప్లీజ్‌..'' అంటూ సితార సంస్థ విజ్ఞప్తి చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

Vijay Devarakonda: లీకైన విజయ్ లుక్.. ప్లీజ్‌ ఆ ఫొటో షేర్‌ చేయొద్దు అంటూ పోస్ట్..!
New Update

Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. శ్రీలంకలోని గాలే ఫోర్ట్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

లీకైన విజయ్ దేవరకొండ స్టిల్స్

అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన విజయ్ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో విజయ్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ లీక్స్ కాస్త సోషల్ మీడియాల్ ఫుల్ వైరల్ కావడంతో చిత్రయూనిట్‌ అలర్ట్ అయ్యింది. వెంటనే వాటిని తొలగించే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోనే మరో స్టిల్ లీకైంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్

ఇక దీని పై స్పందించిన మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. "డియర్ రౌడీ ఫ్యాన్స్ .. మీకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి టీమ్ #VD12 ఎంతో కష్టపడుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసాము. ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాము. ఈ లీక్‌లను షేర్ చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది చిత్రబృందం. "

ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ రివీల్ చేయలేదు మేకర్స్.

Also Read: Mister Bachchan : రవితేజ లుక్ అదుర్స్.. ‘రెప్పల్‌ డప్పుల్‌’ సాంగ్ లుక్ పోస్టర్ - Rtvlive.com







#vd12 #vijay-devarakonda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe