#SVC58: వెంకీ- అనిల్ మూవీ షూట్ మొదలైంది.. కోటి ఉమెన్స్ కాలేజీలో భారీ సెట్స్

ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత విక్ట‌రీ వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైనట్లు తెలిపింది చిత్రబృందం. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ముఖ్య సన్నివేశాలు షూట్ చేయ‌బోతున్న‌ట్లు వీడియోను రిలీజ్ చేశారు.

#SVC58: వెంకీ- అనిల్ మూవీ షూట్ మొదలైంది.. కోటి ఉమెన్స్ కాలేజీలో భారీ సెట్స్
New Update

Venkatesh – Anil Ravipudi: F2,F3 బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేష్ కాంబో మరో సారి ప్రేక్షకుల ముందు రాబోతుంది.  వీరిద్దరి కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇటీవలే దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా నిర్వహించారు.

#VenkyAnil3 షూట్ మొదలైంది

అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా తెలిపింది చిత్రబృందం. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో (కోటి ఉమెన్స్ కాలేజ్) ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు. చిత్రీకరణ కోసం దర్భార్ హాల్లో భారీ సెట్స్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ  #VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS ❤️‍🔥అనే క్యాప్షన్ తో సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరీ, ఐశ్వ‌ర్య రాజేష్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Also Read: OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..!

#hero-venkatesh #anil-ravipudi #svc58 #venkyanil3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe