Devi Sri Prasad: హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్..!

దుమ్మురేపే మాస్ బీట్స్, రొమాంటిక్, సెంటిమెంట్ ఇలా జానర్ ఏదైనా తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సంగీత దర్శకుడు, టాలీవుడ్ రాక్ స్టార్, నేషనల్ అవార్డు విజేత దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మ్యూజిక్ కెరీర్ గురించి తెలుసుకుందాము.

New Update
Devi Sri Prasad: హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్..!

Devi Sri Prasad:  సినిమాల్లో ఆయన పాట వింటే ఎవరికైనా స్టెప్పులేయాలనిపిస్తుంది. రెండు దశాబ్దాల దేవి సంగీత ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో తన సంగీతాన్ని అందించారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి స్టార్ హీరోలకు మ్యూజికల్ హిట్స్ అందించిన దేవి.. భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ సంగీత స్వరకర్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు.

దేవి సూపర్ హిట్ ఆల్బమ్స్

2002లో దేవి చేసిన కలుసుకోవాలని, మన్మధుడు, సొంతం చిత్రాల ఆల్బమ్స్ ఆ సమయంలో అతి పెద్ద చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. కమర్షియల్ గా భారీ విజయం సాధించిన ఈ చిత్రాలకు దేవి మ్యూజిక్ అతి పెద్ద ప్లస్ గా నిలిచింది. సొంతం, మన్మధుడు మ్యూజికల్ హిట్స్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాయి. ఆ తర్వాత 'ఖడ్గం' మూవీలోని ''నువ్వు నువ్వు'' సాంగ్ దేవి ఆల్బమ్స్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా మారుమోగింది.

కింగ్ ఆఫ్ ఐటెం నెంబర్స్

దేవి జిగేలు రాణి", "ఆ అంటే అమలాపురం", "కెవ్వు కేక", "ఆకలేస్తే అన్నం పెడతా", "ఊ అంటావా ఊ ఊ అంటావా" వంటి ఐకానిక్ ఐటం నెంబర్స్ కంపోజ్ చేశాడు. ఈ పాపులర్ మాస్ బీట్స్ దేవిని "king of item numbers" గా మార్చాయి.

ఐటం నెంబర్స్ తో పాటు రొమాంటిక్ మెలోడీ, పాప్ రాక్, హార్డ్ రాక్ ఇలా జానర్ ఏదైనా తన మ్యూజిక్ స్టైల్ తో మ్యాజిక్ చేస్తారు దేవి. "మెల్లగా కరగాని", "ఘల్ ఘల్", "గుడిలో బడిలో, అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి", "బొమ్మను గీస్తే", 'ఎంత సక్కగున్నావే' వంటి ఆల్బమ్ ఆల్ టైం చార్ట్ బస్టర్స్ గా గుర్తుండిపోతాయి. అదుర్స్, మిస్టర్ పర్ఫెక్ట్, గబ్బర్ సింగ్, జులాయి, మిర్చి, అత్తరమ్మ, మిర్చి, నేను , 1: నేనొక్కడినే, లెజెండ్, S/O సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఖైదీ నంబర్ 150, DJ: దువ్వాడ జగన్నాథం, జై లవ కుశ, రంగస్థలం, భరత్ అనే నేను, ఉప్పెన, పుష్ప: ది రైజ్ ఆల్బమ్స్ దేవి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ 

దేవి శ్రీ ప్రసాద్ కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన తండ్రి గొర్తి సత్యమూర్తి గొప్ప కథా రచయిత. గొర్తి సత్యమూర్తి ఖైదీ నంబర్‌ 786, అభిలాష, ఛాలెంజ్‌ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించారు. అయితే దేవి చిన్నతనంలో దర్శకుడు ఎం.ఎస్ రాజు ఇంటికి వచ్చారట. ఆ సమయంలో దేవి శ్రీ గది నుంచి సంగీత వాద్యాల శబ్దాలు విని.. ఒక సందర్భానికి టైన్ ఇవ్వమని అడిగారట. ఆ తరువాత రెండు రోజుల్లో దేవి చేసిన ట్యూన్‌ విని ఎంఎస్‌ రాజు ఆశ్చర్యపోయారట. అలా దేవి శ్రీ ప్రసాద్ కు ‘దేవి’ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి అవకాశం ఇచ్చారట ఎం.ఎస్ రాజు.

Also Read: Saripodhaa Sanivaaram: "సరితూగే సమరమే, సంహారం తథ్యం".. ఎస్‍. జే సూర్య బర్త్ డే స్పెషల్..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు