Puri Jagannath: రవితేజ- దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా చెబుతారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ మూడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి.
పూరి జగన్నాథ్-రవితేజ
అయితే తాజాగా 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ ఏవీనీ ప్రదర్శించగా.. అందులో ఎక్కడా కూడా రవితేజ సినిమాల ప్రస్తావన లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ పోటీనే వీరిద్దరి మధ్య గ్యాప్ తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ కు 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం కీలకంగా మారింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పోటీగా రవితేజ మిస్టర్ బచ్చన్ రావడమే వీరిద్దరి మధ్య దూరానికి కారణమని టాక్ నడుస్తోంది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ రెండూ ఆగస్టు 15న విడుదల కానున్నాయి. పూరి ఏవీలో దాదాపు ఆయనతో అందరు హీరోలు ఉండగా.. ఆయనతో కలిసి ఐదు సినిమాలు చేసిన రవితేజ ప్రస్తావన లేకపోవడం చర్చకు దారితీసింది.
Also Read: Super Deluxe: తెలుగులో సమంత తమిళ్ సూపర్ హిట్.. 'సూపర్ డీలక్స్'...! - Rtvlive.com