Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' చూడడానికి 5 కారణాలు.?

రామ్ - పూరి జగన్నాథ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి మార్క్ డైరెక్షన్, రామ్ యాక్షన్, డైలాగ్స్, సంజయ్ దత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, ఫ్యూచరిస్టిక్ ప్లాట్ ఎలిమెంట్స్. ఈ 5 అంశాలు సినిమాకు హైలైట్స్ గా ఉంటాయని మూవీ టీం చెబుతోంది.

New Update
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' చూడడానికి 5 కారణాలు.?

Double Ismart: ఆగస్టు 15 న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'డబుల్ ఇస్మార్ట్' ఒకటి. పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న ఈ హై యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ ప్రత్యేక శైలి ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో రామ్ యాటిట్యూడ్, చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ సినిమా పై హైప్ పెంచేశాయి. అయితే  ఈ 5 అంశాలు సినిమాకు హైలైట్స్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్

ఈ మూవీలో హీరో బ్రెయిన్ లో USB చిప్ పొందుపరిచి ఒకే వ్యక్తిలో రెండు షేడ్స్ చూపించారు. ఈ USB ఐడియా కొత్త ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్ ను పరిచయం చేసింది. హీరో బ్రెయిన్ లో ఈ చిప్ పెట్టడం ద్వారా కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకోనున్నాయని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

రామ్ పర్ఫామెన్స్

డబుల్ ఇస్మార్ట్ శంకర్ గా.. రామ్ మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో రామ్ ఎలెక్ట్రిఫైయింగ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ సీక్వెల్ పై హైప్ పెంచుతున్నాయి.

పూరి జగన్నాథ్ ట్రేడ్ మార్క్ డైరెక్షన్

దర్శకుడు పూరి జగన్నాథ్ తన విలక్షణమైన ఫిల్మ్ మేకింగ్ కు ప్రసిద్ధి చెందాడు. అతని సినిమాలు పదునైన డైలాగ్స్, హై-ఆక్టేన్ యాక్షన్, ఆకట్టుకునే కథనాన్ని కలిగి ఉంటాయి. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో కూడా పూరి ట్రేడ్‌మార్క్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

సంజయ్ దత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్

విలన్ పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపించడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. రామ్, సంజయ్ దత్ మధ్య జరిగే థ్రిల్లింగ్ షోడౌన్‌ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది.

ప్రీక్వెల్ సక్సెస్

ఇస్మార్ట్ శంకర్ మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్ కూడా అదే ఊపుతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రీక్వెల్ మాదిరిగానే పవర్ ఫుల్ డైలాగ్స్, డైనమిక్ స్క్రీన్ ప్రజెన్స్, హై-యాక్షన్ సీక్వెన్స్‌లతో డబుల్ ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు ఓ విజువల్ ట్రీట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Kriti Sanon: అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు