Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'స్త్రీ 2' హవా.. నాలుగు రోజుల్లో భారీ వసూళ్ళు.!

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ2'. తొలిరోజే అదిరిపోయే ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాలుగు రోజుల్లో రూ. 204 కోట్ల వసూళ్లను రాబట్టింది.

New Update
Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'స్త్రీ 2' హవా.. నాలుగు రోజుల్లో భారీ వసూళ్ళు.!

Stree 2: శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన కామెడీ హర్రర్ 'స్త్రీ2'. 2018లో భారీ విజయం సాధించిన స్త్రీ సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే రూ. 58.20 కోట్లతో ఫైటర్, కల్కి ఫస్ట్ డే రికార్డులను బ్రేక్ చేసింది. అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

'స్త్రీ 2' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

నివేదికల ప్రకారం.. 'స్త్రీ 2' విడుదలైన నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు 55.40 కోట్లు, రెండవ రోజు 35.30 కోట్లు, మూడవ రోజు 45.70 కోట్లు, నాలుగవ రోజు దాదాపు రూ. 58.20 కోట్లను వసూళ్లు చేసింది. పెయిడ్ ప్రివ్యూస్ తో కలిపి నాలుగు రోజుల్లో ఈ సినిమా మొత్తం రూ. 204 కోట్ల వసూళ్లు రాబట్టింది.  లాంగ్ వీకెండ్, రాఖీ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది ఇలా ఉంటే అదేరోజు విడుదలైన అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే', జాన్ అబ్రహం 'వేద' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తొలిరోజు రూ.5.05 కోట్లతో మొదలైన 'ఖేల్ ఖేల్ మే' 4 రోజుల్లో కేవలం 13.95 కోట్ల బిజినెస్ మాత్రమే చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.6.3 కోట్లతో మొదలైన జాన్ అబ్రహం 'వేద' నాలుగు రోజుల్లో 15. 95 కోట్ల బిజినెస్ చేసింది.

Also Read: Stree 2: ఫైటర్, కల్కి రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే 'స్త్రీ 2' కలెక్షన్స్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు