Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' లో సిద్దూ, దేవిశ్రీ ప్రసాద్.. అదిరిపోయిన ఎంట్రీ! రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. నేడు థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాలోని పలు గెస్ట్ రోల్స్ మాత్రం సూపర్‌గా ఉన్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. యాక్షన్ సీన్‌లో సిద్దూ, ఓ స్పెషల్ సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించి సర్ప్రైజ్ చేశారు. By Archana 15 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mr Bachchan: డైరెక్టర్ హరీష్ శంకర్- మాస్ మహారాజ్ రవితేజ కాంబోలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'మిస్టర్ బచ్చన్'. నేడు థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా చూసిన ట్విట్టర్ లో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో రవితేజ పర్ఫామెన్స్, హీరోయిన్ భాగ్యశ్రీ స్క్రీన్ ప్రజెన్స్, కొన్ని కామెడీ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మిస్టర్ బచ్చన్ కేమియో రోల్స్ అయితే వీటితో పాటు ఈ సినిమాలోని పలు కేమియో రోల్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాయి. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కేమియో ఎంట్రీ అదిరిపోయినట్లు చెబుతున్నారు. ఓ యాక్షన్ సీన్ లో సిద్దూ, స్పెషల్ సాంగ్ ... ‘నల్లంచు తెల్లచీర’ లో దేవి కనిపించడం సూపర్ గా ఉందని అంటున్నారు. అంతే కాదు సినిమా ప్రారంభ సీన్ లో రైటర్ రైటర్ బివిఎస్ రవి కూడా కనిపించి అలరించారు. ఇక సినిమా కొంత మంది అభిమానులను డిస్సప్పాయింట్ చేసినప్పటికీ.. ఇలా కేమియోలతో సర్ప్రైజ్ చేయడంతో ఖుషీ అవుతున్నారు. Starboy cameo in Mr.Bachchan ⭐ pic.twitter.com/PJmkkT6RCX — Labour annaa vodhileyy!! (@silpings) August 14, 2024 ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటించగా.. జగపతి బాబు, తనికెళ్ళ భరణి, ప్రవీణ్, చమ్మక్ చంద్ర, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాలో భాగ్య శ్రీ అందం, స్క్రీన్ ప్రజెన్స్ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. మిస్టర్ బచ్చన్ తో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది. Also Read: Independence Day 2024: ఈ దేశభక్తి సాంగ్స్ సూపర్ హిట్స్.. పుణ్యభూమి నాదేశం, మేమే ఇండియన్స్ తో పాటు - Rtvlive.com #raviteja-mr-bachchan #mr-bachchan-cameos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి