/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-18T181603.667.jpg)
Priyanka Chopra: నటి ప్రియాంక చోప్రా అటు బాలీవుడ్ ఇటు హాలీవుడ్ సినిమాల్లో రాణిస్తూ గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపును తెచ్చుకుంది. 2 దశాబ్దాలుగా నట ప్రపంచంలో చురుకైన పాత్ర పోషిస్తున్న దేశీ అమ్మాయి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె భర్త భర్త నిక్ జోనాస్ ప్రియాంకకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ తెలియజేశారు. అలాగే ప్రియాంకతో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను కూడా పంచుకున్నాడు. "నేను అదృష్టంగా భావించే మహిళ మీరు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియతమా అంటూ భార్యకు స్పెషల్ విషెష్ తెలిపారు.
బాలీవుడ్ ఫేమ్ ప్రియాంక ప్రస్తుతం తన భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఇటీవలే ప్రియాంక తన భర్తతో కలిసి ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అనంత్- రాధికా భరాత్ లో చిక్నీ చమేలీ, ముజ్సే షాదీ కరోగి వంటి చార్ట్‌బస్టర్ పాటలకు స్టెప్పులేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ప్రియాంక మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి.. 2000 సంవత్సరంలో, ఆమె మిస్ ఇండియా రన్నరప్, మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2002లో ప్రియాంక తమిళ చిత్రం ‘తమిజాన్’తో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ సరసన ఎట్జార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియాంక నెగెటివ్ రోల్ చేసి ప్రేక్షకులకు విపరీతంగా మెప్పించింది. ఇక ఆ తర్వాత తన నటన, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
Image Credits: nick jonas/Instagram
View this post on Instagram
Murari Re- Release: మురారి వెడ్స్ వసుంధర.. నెట్టింట 'మురారి' రీ రిలీజ్ ట్రెండ్..! - Rtvlive.com