Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ 'కల్కి 2898 AD' ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. రూ. 1100 కోట్లతో అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా.. స్వస్తా ఛటర్జీ, దిశా పటానీ, శోభన, వినయ్ కుమార్, దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
'కల్కి 2898 AD' ఓటీటీ రిలీజ్ డేట్
అయితే తాజాగా కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రభాస్ బ్లాక్ బస్టర్ కల్కి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక థియేటర్స్ లో కల్కి ని చూసే ఛాన్స్ మిస్ అయినవారు ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.
మూవీ స్టోరీ
మహాభారత కాలాన్ని వర్తమానానికి, భవిష్యత్తుకు కనెక్ట్ చేసేలా ఈ సినిమా కథ కనిపిస్తుంది. ఈ కథ అనేక వందల సంవత్సరాల భవిష్యత్తులో వ్రాయబడింది. సినిమా కథ ప్రపంచంలోని పురాతన నగరం కాశీ నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో భైరవుడి పాత్రలో ప్రభాస్ నటించగా .. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్, సుమతి పాత్రలో దీపికా పదుకొణె నటించారు.
Also Read: Varun Dhawan : సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్ - Rtvlive.com