Ambani Wedding: అంబానీ సంగీత్ లో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మ్యూజికల్ షో ..!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం గ్రాండ్ సంగీత్ వేడుకను నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ సంగీత్ వేడుకలో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన మ్యూజికల్ ప్రదర్శనతో వేడుకను మరింత గ్రాండ్ గా చేశాడు.

New Update
Ambani Wedding: అంబానీ సంగీత్ లో పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మ్యూజికల్ షో ..!

Ambani Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అనంత్ - రాధికా మర్చంట్ జులై 12న వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అనంత్ - రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్ళికి ముందు జరగాల్సిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ నిర్వహిస్తున్నారు అంబానీ కుటుంబం. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ఇప్పటికే 'మామేరు' వేడుక పూర్తవగా.. తాజాగా జులై 5న సంగీత్ వేడుకను నిర్వహించింది. ఈ సంగీత్ వేడుక బాలీవుడ్ తారలు, స్టార్ క్రికెటర్లు, ప్రముఖులతో సందడిగా మారింది.

జస్టిన్ బీబర్ మ్యూజికల్ షో

అంబానీ సంగీత్ వేడుకను మరింత గ్రాండ్ గా చేసేందుకు హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అద్భుతమైన సంగీత ప్రదర్శన ఇచ్చాడు. అనంత- రాధికా సంగీత్ వేడుకలో జస్టిన్ బీబర్ తన మ్యూజిక్ తో అతిథులను పిచ్చెక్కించాడు. 'బేబీ', 'నెవర్ లెట్ యు గో', 'లవ్ యువర్ సెల్ఫ్', 'పీచెస్', 'బాయ్‌ఫ్రెండ్', 'సారీ' మరియు 'వేర్ ఆర్ యు నౌ' వంటి పాపులర్ ఆల్బమ్స్ ప్లే చేస్తూ సంగీత్ వేడుకను మరింత హైలెట్ చేశాడు. సంగీత్ కు హాజరైన సెలెబ్రెటీలు జస్టిన్ బీబర్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ.. అతనితో కలిసి పాడుతూ సందడి చేశారు.

Also Read: Kubera First Look: రష్మిక.. గొయ్యిలో డబ్బులు ఎందుకు పాతిపెట్టింది..? ఆసక్తిగా కుబేర ఫస్ట్ లుక్..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు