AAY OTT: 'ఆయ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్.. స్ట్రీమింగ్ అక్కడే..?

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'ఆయ్'. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ఆయ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

New Update
AAY OTT: 'ఆయ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్.. స్ట్రీమింగ్ అక్కడే..?

AAY OTT:  హీరో నార్నే నితిన్ రీసెంట్ గా 'మ్యాడ్' మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అరవింద్ సమర్పణలో నార్నే నితిన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఆయ్'. ఆగస్టు 15న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా కథ, చిత్రంలో సహజమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రష్మిక మందన్న పలువురు సెలెబ్రెటీలు ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో పాటు ప్రమోట్ చేశారు.

ఆయ్ ఓటీటీ రిలీజ్

అయితే  తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 'ఆయ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిజల్ట్స్ ఆధారంగా మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. దర్శకుడు అంజి కె మణిపుత్ర తెరకెక్కించిన ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ నయన్ సారిక ఫిమేల్ లీడ్ గా నటించగా.. రాజ్‌కుమార్ కసిరెడ్డి , అంకిత్ కొయ్య, వినోద్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Maruthi Nagar Subramanyam: ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్టుగా బన్నీ.. ఆ అంశంపై స్పందిస్తారా? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు