/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-30T124335.873.jpg)
Mathu Vadalara 2 Teaser Out Now : హీరో శ్రీసింహా (Sri Simha) 'మత్తు వదలరా' (Mathu Vadalara 2) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. శ్రీ సింహా హీరోగా నట అరంగేట్రం చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఇందులో శ్రీ సింహా నటనకు సైమా అవార్డు (SIIMA Award) వరించింది. ఆ తర్వాత 'తెల్లవారితే గురువరం', దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే పలు చిత్రాలతో అలరించిన శ్రీసింహా.. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మత్తు వదలరా 2
రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వంలో శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'మత్తు వదలరా2'. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు ఆసక్తికరమైన క్యాప్షన్ల తో సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
మత్తు వదలరా 2 టీజర్
వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్స్ తో మొదలైన ఈ టీజర్ వినోదాత్మకంగా సాగింది. టీజర్ లో ఫరియా సీన్స్, శ్రీసింహా, కమెడియన్ సత్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అసలు హీరో ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనే అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఇక టీజర్ లో కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Viduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...! - Rtvlive.com