IMDB Rating: 'బిగ్ బాస్', 'ఖత్రోన్ కే ఖిలాడీ' వంటి షోలు 10 సీజన్లకు పైగా షోలను పూర్తి చేయడం, భారతదేశంలో రియాలిటీ టీవీ షోలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. చాలా రియాలిటీ షోలు ఒకే ఫార్మెట్‌లో ఉంటాయి కానీ అవి వివిధ దేశాల్లో తమదైన రీతిలో డిజైన్ చేయబడతాయి. అయితే ఇండియాలో అత్యధిక IMDb రేటింగ్స్‌తో ఉన్న రియాల్టీ షోలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ? ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో 'బిగ్ బాస్', MTV లాంగ్ రన్ షో రోడీస్ కూడా ఉన్నాయి.
మీలో ఎవరు కోటీశ్వరుడు
ఈ షోకి వచ్చే ప్లేయర్లు కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా కోట్ల విలువైన డబ్బును గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ఈ రియాలిటీ టీవీ షో IMDbలో 8.2 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే, ఇది ప్రతి సీజన్‌లో కొద్దిగా హెచ్చుతగ్గులకు గురవుతుంది.
ఇండియన్ ఐడల్
2004లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో 'అమెరికన్ ఐడల్' అనే షో నుంచి రూపొందించబడింది. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఈ షోలో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఈ షో IMDb రేటింగ్ చూస్తుంటే ఇప్పటికీ ఈ షో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. అప్ కమింగ్ సింగర్స్ ఒక మంచి ప్లాట్ ఫార్మ్ గా పేరొందిన ఈ షో IMDb రేటింగ్ 7.7.
డాన్స్ ఇండియా డ్యాన్స్
కొత్తగా వచ్చిన డ్యాన్సర్లకు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' ఫేవరెట్. ఈ రియాలిటీ షో TRP సుమారు 7.7. అయితే గత కొంత కాలంగా రెమో డిసౌజా డ్యాన్స్ ప్లస్ షో దీన్ని బీట్ చేస్తోంది. డాన్స్ ప్లస్ IMDb రేటింగ్ కొన్ని సీజన్లలోనే 8 దాటింది.
MTV రోడీస్
మోటారు సైకిళ్లపై చాలా దూరం ప్రయాణించడం, సైకిల్స్ పై అడ్వెంచర్స్ చేయడం ఈ షో కాన్సెప్ట్. చివరికి గెలిచినా వారు భారీ మొత్తం డబ్బును గెలుచుకుంటారు. ఈ షో IMDb రేటింగ్ 7.5, ఇది కొన్ని సీజన్లలో 8 కూడా చేరుకుంది.
బిగ్ బాస్
కలర్స్ టీవీలో ప్రసారమయ్యే రియాల్టీ టీవీ షో 'బిగ్ బాస్' బడ్జెట్, ప్రజాదరణ కారణంగా టీవీలో అతిపెద్ద రియాలిటీ షోగా పరిగణించబడుతుంది. ఈ షో అమెరికన్ షో 'బిగ్ బ్రదర్'కి హిందీ వెర్షన్. సల్మాన్ ఖాన్ గత చాలా సంవత్సరాలుగా దీనిని హోస్ట్ చేస్తున్నారు. ఈ షో IMDb రేటింగ్ కొన్ని సీజన్లలో 5కి చేరుకుంది. కానీ సాధారణంగా ఇది 4.0 మాత్రమే ఉంటుంది. రేటింగ్స్ మామూలుగా ఉన్నప్పటికీ, ఇది ఒక హిట్ షో.
Also Read: Brahmamudi: ఇందిరాదేవి ప్లాన్ అదిరింది.. ఒకటైన కావ్య, రాజ్..! కనకానికి గుండెపోటు..!