Naga Chaitanya: పెళ్లి ఎప్పుడు.. ఎక్కడో చెప్పేసిన నాగచైతన్య..? అక్కినేని నాగ చైతన్య- శోభిత పెళ్ళెప్పుడు.? ఎక్కడ.? అనే దానిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. తాజాగా హీరో నాగచైతన్య ఈ ప్రశ్నల పై స్పందించారు. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని. త్వరలోనే ఆ వివరాలన్నీ చెబుతానను అని స్పష్టం చేశారు. By Archana 29 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naga Chaitanya: ఇటీవలే అక్కినేని నాగచైతన్య నటి శోభితను నిశితార్థం చేసుకున్నారు. ఇంట్లోనే జరిగిన ఈ ప్రైవేట్ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో కొడుకు ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శోభిత, చైతన్య కూడా తమ సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. పెళ్ళెప్పుడు..? ఎక్కడ.? ఇది ఇలా ఉంటే.. వీళ్లిద్దరి నిశ్చితార్థం అయినప్పటి నుంచి వీరి పెళ్ళెప్పుడు..? ఎక్కడ.? అనే విషయం పై నెట్టింట చాలానే చర్చలు జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అని కొందరు, లేదు నిశ్చితార్థం మాదిరిగానే పెళ్లి కూడా ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటారని పలు రకాల కథనాలు వచ్చాయి. ఇక ఈ పుకార్లు అన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టాడు నాగచైతన్య. తాజాగా ఓ డిజైనర్ స్టూడియో ఓపెనింగ్ కు వెళ్లిన నాగ చైతన్య పెళ్ళెప్పుడు అనే దాని పై స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్ళికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్లాన్స్ అనుకోలేదు అని స్పష్టం చేశారు. పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ చేసుకోవాలి.? అనే దాని పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. త్వరలోనే ఆ వివరాలన్నీ ప్రకటిస్తానని చెప్పారు నాగచైతన్య. ఇక అందరు నిశితార్థం అయిన నెలల గ్యాప్ లోనే పెళ్లి ఉంటుందని అనుకున్నారు. Also Read: Purushothamudu: 'పురుషోత్తముడు' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలోనే - Rtvlive.com #naga-chaitanya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి