/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-17T093328.042.jpg)
Brahma Anandam: లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన తదుపరి చిత్రంలో కొడుకు గౌతమ్ తో కలిసి స్క్రీన్ పై అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్రహ్మానందం, గౌతమ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మ ఆనందం’. డెబ్యూ డైరెక్టర్ RVS నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.
‘బ్రహ్మ ఆనందం’ ఫస్ట్ లుక్
తాజాగా ఈ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బ్రమహానందం ఆరెంజ్ కలర్ కుర్తా, తెల్లటి లుంగీ, నలుపు రంగు గాగుల్స్ ధరించి రెగల్‌గా కనిపించారు. సాంప్రదాయ పంచకట్టులో బ్రహ్మానందం ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 19న గ్లింప్ వీడియో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులు( బ్రహ్మానందం- గౌతమ్ ) తాత మనవళ్లుగా నటించడం ఆసక్తికరంగా ఉంది.
Joy is Timeless, and here is the Dazzling Proof of it 🤩
Here is 'Padma Shri' #Brahmanandam Garu's First Look from #BrahmaAnandam ❤️🔥
Glimpse out on August 19th at 12:34 PM 🤩
Stay tuned!#RajaGoutham 'Padma Shri' #Brahmanandam @RahulYadavNakka @Swadharm_Ent @rvs_nikhil25… pic.twitter.com/0ejwahiW3G
— Swadharm Entertainment (@Swadharm_Ent) August 16, 2024
‘బ్రహ్మ ఆనందం’ డిసెంబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోళక్కల్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య పిసాపాటి సంగీతం అందిస్తున్నారు.