Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..!

బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్ళెప్పుడు అని అడగగా దానికి ఆమె సరదాగా సమాధామిచ్చింది. ''తాను వధువు కావాలనుకున్నప్పుడు, అవుతుంది'' అని చెప్పుకొచ్చింది.

Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..!
New Update

Shraddha Kapoor: బాలీవుడ్ మోస్ట్ పాపులర్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లేటెస్ట్ హారర్ కామెడీ 'స్త్రీ-2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్త్రీ సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నస్త్రీ శ్రద్ధ కపూర్ పెళ్లికి సంబంధిందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

publive-image

పెళ్లి పై శ్రద్ధ కపూర్ రియాక్షన్

పెళ్లి ఎప్పుడు అని ఆగడగా దానికి ఆమె సరదాగా సమాధానం ఇచ్చింది. శ్రద్దా మాట్లాడుతూ.. ''..నేను వధువు కావాలని నిర్ణయించుకున్నప్పుడు అవుతుంది. అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే శ్రద్ధా కపూర్ రాహుల్ మోదీ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. శ్రద్దా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాహుల్ మోదీతో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

publive-image

ప్రస్తుతం శ్రద్ధ 'స్త్రీ 2'  ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. సోషల్ మీడియాలో టాప్ 2 ట్రెండింగా కొనసాగుతోంది. 2018లో విడుదలైన 'స్త్రీ' భారీ విజయాన్ని అందుకోవడంతో 'స్త్రీ 2'  కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Bhaiyya Ji: 'భయ్యా జీ' వచ్చేస్తున్నాడు.. ఓటీటీలో మనోజ్ బాజ్‌పేయి 100వ సినిమా..! - Rtvlive.com


#actress-shraddha-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe