Bhaiyya Ji: 'భయ్యా జీ' వచ్చేస్తున్నాడు.. ఓటీటీలో మనోజ్ బాజ్‌పేయి 100వ సినిమా..!

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భయ్యాజీ'. మే 24న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జూలై 26 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

New Update
Bhaiyya Ji: 'భయ్యా జీ' వచ్చేస్తున్నాడు.. ఓటీటీలో మనోజ్ బాజ్‌పేయి 100వ సినిమా..!

Bhaiyya Ji:  బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి లేటెస్ట్ మూవీ 'భయ్యా జీ' ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా మూవీ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. బాజ్‌పేయి కెరీర్‌లో అతి ముఖ్యమైన చిత్రాల్లో ఒకటైన.. 'భయ్యా జీ' జులై 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ Zee 5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. రాబిన్‌హుడ్ కాదు, రాబిన్‌హుడ్ తండ్రి. 'భయ్యా జీ' విధ్వంసం సృష్టించేందుకు వస్తున్నాడు అనే క్యాప్షన్ తో ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'భయ్యా జీ' ఓటీటీ రిలీజ్

ఈ ఏడాది మే 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.11.52 కోట్లు రాబట్టింది. మనోజ్ బాజ్‌పేయి కెరీర్‌లో 100వ సినిమా కావడం విశేషం. అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ, జోయా హుస్సేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు... ఇంట్లో హాయిగా కూర్చుని ఈ చిత్రాన్ని చూడవచ్చు.

View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

Also Read: Thangalaan : విక్ర‌మ్ ‘తంగలాన్’.. రిలీజ్ డేట్ వచ్చేసింది..?

Advertisment
తాజా కథనాలు