Bigg Boss Season8: బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిస్తే షాకే..!

బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సీజన్ 8 ఆగస్టు 4 లేదా 11వ తేదీల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో బర్రెలక్క, హేమ, సురేఖావాణి, రీతూ చౌదరి, కిరాక్ ఆర్పీ, రాజ్ తరుణ్ కుమారీ ఆంటీ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Bigg Boss Season8: బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ లిస్ట్ తెలిస్తే షాకే..!

Bigg Boss Season8: భారతదేశంలో రియాలిటీ షోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ షోలకు ప్రేక్షకాదరణ కూడా ఎక్కువే. తెలుగులో అత్యధిక ప్రేక్షాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఈ షో మొదలైన తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్ ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెర పై టాప్ టీఆర్పీ రేటింగ్స్ సత్తా చాటుతోంది. బుల్లితెర పై మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ హవా ఒక రేంజ్ లో ఉంటుంది. షో మొదలవగానే తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఒక సీజన్ పూర్తవగానే.. మరో సీజన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇప్పటికీ బిగ్ బాస్ 7 సీజన్స్ పూర్తి చేసుకుంది.

publive-image

సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళే

ఇక సీజన్ 8 ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చే నెల 4 లేదా 11వ తేదీల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క, హేమ, సురేఖావాణి, రీతూ చౌదరి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, హీరో రాజ్ తరుణ్ కుమారీ ఆంటీ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read: Shalini Pandey: “ఆ సీన్ చీకటి గదిలో చేశారు”… భయమేసి బయటకు వెళ్ళిపోయిన షాలిని..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు