Super Deluxe: తెలుగులో సమంత తమిళ్ సూపర్ హిట్.. 'సూపర్ డీలక్స్'...!

సమంత, విజయ్‌సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘సూపర్‌డీలక్స్‌’. 2019 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 9న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

New Update
Super Deluxe: తెలుగులో సమంత తమిళ్ సూపర్ హిట్.. 'సూపర్ డీలక్స్'...!

Super Deluxe: త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో సమంత, విజయ్‌సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ చిత్రం 'సూపర్ డీలక్స్'. నలుగురి వ్యక్తుల కథల సంహారంగా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు ఇలా పలు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం.

తెలుగులో 'సూపర్ డీలక్స్'

తమిళంలో గొప్ప విజయం సాధించిన 'సూపర్ డీలక్స్'.. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 9 న ఈ చిత్రాన్ని తెలుగులో థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. దైవసెల్వితీర్థం ఫిలింస్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని వినూత్న కథా విధానం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

Also Read: Mechanic Rocky: మెకానిక్ రాఖీ ఫస్ట్ సింగిల్.. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు' - Rtvlive.com 

Advertisment
తాజా కథనాలు