Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? నటి సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ''సంథింగ్ స్పెషల్ రాబోతుంది'' అని ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ చూసిన కొందరు సినిమా అప్డేట్ అనగా.. మరికొందరు తన వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఏదైనా చెప్తుందా అని అంటున్నారు. By Archana 20 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Samantha: ప్రస్తుతం సమంత వెబ్ సీరీస్ తో పాటు తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. అయితే సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య ఇటీవలే నటి శోభిత దూళిపాలతో నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాకిచ్చారు. దీంతో ఈ మధ్యకాలం సమంత ఏ పోస్ట్ పెట్టిన దాంట్లో ఏదో ఉందని కుతూహలంగా చూస్తున్నారు నెటిజన్లు. ''సంథింగ్ స్పెషల్'' ఈ నేపథ్యంలో తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ''సంథింగ్ స్పెషల్ రాబోతుంది'' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏదైనా సినిమా అప్డేట్ గురించి కావచ్చు అని కామెంట్ చేయగా.. మరికొందరు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఏదైనా చెప్పబోతుందేమోనని అంటున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే సామ్ బాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె సన్నిహితులు ఇందులో ఎలాంటి నిజం లేదని, ఇలాంటివి నమ్మొద్దని కోరారు. ఇక ఈరోజు సమంత ''సంథింగ్ స్పెషల్ రాబోతుంది'' అని పోస్ట్ చేయడంతో సమంత కూడా నాగచైతన్యలా ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకుంటుందా? దానికి సంబంధించిన వార్తేనా అని చర్చించుకుంటున్నారు. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. Also Read: Sudheer Babu: ప్రభాస్ ముందు మీరు బచ్చాలు..! బాలీవుడ్ నటుడికి ఇచ్చిపడేసిన సుధీర్ #actress-samantha #samantha-post మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి