Actor Suhas: "జనక అయితే గనక".. మరో కొత్త కథతో వచ్చేస్తున్న సుహాస్

యంగ్ హీరో సుహాస్ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జనక అయితే గనక" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షితా, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Actor Suhas:  "జనక అయితే గనక".. మరో కొత్త కథతో వచ్చేస్తున్న సుహాస్
New Update

Actor Suhas - Janaka Aithe Ganaka Movie: యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే కథలు, కాన్సెప్ట్స్ తో హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.

Actor Suhas

"జనక అయితే గనక"

అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో ఖాతాలోకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు వచ్చి చేరింది. తాజాగా సుహాస్ అప్ కమింగ్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. "జనక అయితే గనక" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని బలగం ఫేమ్ హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డిలు దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంగీర్తన విపిన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూలై 4, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Also Reads: Ambani Wedding: 50 జంటలకు సామూహిక వివాహం.. ముఖేష్ అంబానీ ఇచ్చిన బహుమతులివే..! - Rtvlive.com

#janaka-aithe-ganaka #suhas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe