/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T180047.820.jpg)
Actor Suhas - Janaka Aithe Ganaka Movie: యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే కథలు, కాన్సెప్ట్స్ తో హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.
"జనక అయితే గనక"
అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో ఖాతాలోకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు వచ్చి చేరింది. తాజాగా సుహాస్ అప్ కమింగ్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. "జనక అయితే గనక" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Aanandham - Pattalenantha
Baadhalu - Cheppukolenantha
Navvulu - AapukolenanthaHere's the quirky and bewildered first look of @ActorSuhas from #JanakaAitheGanaka ❤️🔥
Teaser On July 4th 🥳@sangeerthanaluv #SandeepReddyBandla @VijaiBulganin #SaiSriRam @KalyanKodati @kk_lyricist… pic.twitter.com/AQhnDJWDbC
— Dil Raju Productions (@DilRajuProdctns) July 2, 2024
ఈ చిత్రాన్ని బలగం ఫేమ్ హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డిలు దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సంగీర్తన విపిన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూలై 4, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.