Kubera First Look: రష్మిక.. గొయ్యిలో డబ్బులు ఎందుకు పాతిపెట్టింది..? ఆసక్తిగా కుబేర ఫస్ట్ లుక్..!

స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. తాజాగా మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీస్తున్న విజువల్స్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

New Update
Kubera First Look: రష్మిక.. గొయ్యిలో డబ్బులు ఎందుకు పాతిపెట్టింది..? ఆసక్తిగా కుబేర ఫస్ట్ లుక్..!

Kubera First Look: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటిస్తున్న కుబేర. తాజాగా ఈ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ సంబంధించిన గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రష్మిక నిర్మానుష్యమైన ఒక అడవి ప్రాంతాల్లోకి వెళ్లి గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీస్తున్న విజువల్స్ చూపించారు. ఆ బ్యాగ్ అంతా డబ్బుతో నిండి ఉంటుంది. అసలు రష్మిక ఆ డబ్బుల సూట్ కేస్ ఎందుకు పూడ్చి పెట్టింది..? ఆ డబ్బును ఎక్కడికి తీసుకెళ్లింది అనే అంశాలతో సస్పెన్స్‌ నెలకొంది.

కుబేర

దర్శకుడు శేఖర్ కముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ధనుష్, నాగార్జున, రష్మిక ముంబై షెడ్యూల్‌లో పాల్గొన్నారు. సోషల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేయనున్నారు. ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Bharateeyudu 2: సెన్సార్ పూర్తి చేసుకున్న 'భారతీయుడు 2'.. U/A సర్టిఫికెట్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు