సెల్‌ఫోన్‌తో గ్రూప్-4 పరీక్ష హాల్లోకి తెలంగాణను ఎంతో అతలాకుతం చేసింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ. ఓ పక్క కేసులు.. విచారణ నడుస్తుండగానే గ్రూప్-4 పరీక్ష నిర్వహించారు టీఎస్పీఎస్సీ అధికారులు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎలాంటి లీకేజీలు జరగకుండా ముందుగానే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా జరగాల్సిన తప్పు మాత్రం జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఎవరు..? యువతనా.. అధికారులా.. అన్న ప్రశ్నకు అంతుచిక్కడం లేదు. అయితే తాజాగా గ్రూప్-4 పరీక్ష హాల్లోకి ఫోన్‌తో ఓ వ్యక్తి పట్టుపడ్డాడు. By Vijaya Nimma 01 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి మాల్ ప్రాక్టీస్ కింద బుకైయ్యాడు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్- 4 పరీక్ష సజావుగా సాగుతుంది అనుకున్న సమయంలోనే జరగాల్సిన ఘోరం జరుగనే జరిగింది. అత్యధిక పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ సారి భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ కఠిన నియమాలు అమలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15నిమిషాలు ముందే గేట్లు మూసివేశారు. ఎంత కఠినంగా నియమాలు అమలు చేసినా.. ఓచోట మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఓ అభ్యర్థి ఏకంగా పరీక్షా హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లాడు. పరీక్ష రాస్తుండగా గమనించిన ఇన్విజిలేటర్ అతడిని పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కింద కేసు బుక్ చేశారు. సెల్‌ఫోన్‌తో పరీక్షా కేంద్రంలోకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మారుతినగర్‌లోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత గమనించిన ఇన్విజిలేటర్ ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. అతని సెల్‌ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఒరిజినల్ ఆధార్‌కార్డు లేదని పరీక్ష రద్దు ఈ ఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. మరోవైపు కొందరు అభ్యర్థులు వివిధ కారణాలతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రాగా.. వారిని నిర్వహకులు అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురాని 10 మంది అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించ లేదు. నల్గొండ జిల్లాలో పరీక్ష రాస్తున్న ఐదుగురు గ్రూప్ 4 అభ్యర్థులను ఒరిజినల్ ఆధార్‌కార్డు లేదని అధికారులు బయటకు పంపారు. ఆధార్ కార్డు ఒరిజినల్ కాకుండా.. జిరాక్స్ తేవడంతో పరీక్ష మధ్యలోనే అభ్యర్థులను వెనక్కి పంపించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి