వెస్టీండీస్ పై మూడవ టెస్ట్ విజయం..సిరీస్ కైవసం చేసుకున్నఇంగ్లాండ్!

బర్మింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది. లార్డ్స్, నాటింగ్‌హామ్ టెస్టులో ఓడిన వెస్టిండీస్ మూడో టెస్ట్ ను కూడా చేజార్చకుంది.

New Update
వెస్టీండీస్ పై మూడవ టెస్ట్ విజయం..సిరీస్ కైవసం చేసుకున్నఇంగ్లాండ్!

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడో టెస్టు జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 282, ఇంగ్లండ్ 376 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 2వ ఇన్నింగ్స్‌లో 33/2 స్కోరు చేసింది. మూడో రోజు  వెస్టిండీస్ 2వ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు 'ఆల్ అవుట్' అయింది.వెస్టీండీస్ ఆటగాు గావెమ్ హాడ్జ్ (55) తో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు తీశాడు. 82 పరుగులు  విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ బెన్ స్టోక్స్ (57*), డకెట్ (25*) తో 87/0 తో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Advertisment
తాజా కథనాలు