Cook: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ కు సరైన ప్రాక్టీస్ లేకపోవడంపై మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతుందనడంలో సందేహం లేదు. కానీ మ్యాచ్‌ ప్రిపరేషన్‌ లేకపోవడమే ఇబ్బంది కలుగుతుందేమోనని అనిపిస్తోంది' అన్నాడు.

Cook: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
New Update

IND vs ENG: భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ టీమ్ కు సరైన ప్రాక్టీస్ లేకపోవడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (Alistair Cook) ఆందోళన వ్యక్తం చేశాడు. ఒక మ్యాచ్ కు ముందు జట్టు సంసిద్ధతంగా ఉండాలంటే ప్రాక్టీస్ గేమ్‌లు చాలా అవసరమన్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ అభివృద్ధికి ఇది చాలా అవసరమన్నాడు. పర్యాటక జట్లకు అనుకూలమైన పరిస్థితులలో నాణ్యమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిర్వహించడానికి క్రికెట్ దేశాల మధ్య ఒక అలిఖిత ఒప్పందం కూడా ఉండాలని సూచించాడు.

అదే పెద్ద దెబ్బ..
ఈ మేరకు జనవరి 25 నుంచి భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్ ఇక్కడకు చేరుకుంది. అయితే, తమ జట్టుకు సరైన సన్నద్ధత లేదని, అదే సిరీస్‌లో వెనకబడటానికి కారణం అవుతుందేమోనని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్ అన్నాడు. ఉపఖండ పిచ్‌లకు సరిపోలేలా ఉంటుందని అబుదాబీని ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు ఎంచుకోవడం పైనా కుక్ స్పందించాడు. ‘అబుదాబీలో మా జట్టు ప్రాక్టీస్‌ చేసింది. అక్కడి పిచ్‌లకు.. భారత్‌ పిచ్‌లకు సారూప్యం ఉంటుందని చెబుతున్నారు. అయితే, అది ఎంతమేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి. మ్యాచ్‌ ప్రిపరేషన్‌ లేకపోవడం మాకు ఇబ్బంది కలుగుతుందేమోనని అనిపిస్తోంది' అన్నాడు.

ఇది కూడా చదవండి : Akhtar: సచిన్ గ్రేటెస్ట్ ఎవర్.. అతనితో పోల్చి చూడలేం: షోయబ్ అక్తర్

బజ్‌బాల్‌ క్రికెట్‌..
‘‘భారత్‌లోనూ ఇంగ్లాండ్‌ జట్టు బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతుందనడంలో సందేహం లేదు. విజయవంతం కావడానికి ఇదో అత్యుత్తమ ఛాన్స్‌. ఉపఖండంలో బ్యాటింగ్‌కు సంబంధించి సంప్రదాయ నిబంధనలను పాటించదు. తొలి 30 బంతులు నిలదొక్కుకుంటే పరుగులను ఆటోమేటిక్‌గా రాబట్టవచ్చు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్పిన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చుట్టూ ఫీల్డర్లు మోహరించి ఉంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మాట్లాడుతూ ఉంటారు. వీటన్నింటినీ తట్టుకుని పరుగులు చేయాలంటే ఇప్పుడు మా జట్టు పాటిస్తున్న బజ్‌బాల్‌ సరైంది. భారత బౌలర్లను ఒత్తిడికి గురి చేస్తారని అనుకుంటున్నా. జో రూట్‌ స్పిన్‌ను చాలా చక్కగా ఆడతాడు. గత గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. టర్నింగ్‌ పిచ్‌లపై ఎలా ఆడాలనేది అతడిని చూసి మిగతా ఇంగ్లిష్‌ బ్యాటర్లు నేర్చుకోవాలి’ అని కుక్ తెలిపాడు.

ఒక్క మ్యాచ్‌ ఉంటే బాగుండేది..
అలాగే 'మేము 2012లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు మూడు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాం. యువరాజ్‌, అజింక్య రహానె, మురళీ విజయ్‌తో కూడిన ఇండియా Aతో తలపడ్డాం. ఛెతేశ్వర్‌ పుజారా కూడా ఒక మ్యాచ్‌లో ఆడాడు. ఇప్పుడు మాత్రం నేరుగా టెస్టు మ్యాచ్‌లోనే ఆడేందుకు మా జట్టు వచ్చింది. షెడ్యూల్‌లో కనీసం ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ ఉంటే బాగుండేది. కానీ, ఇంగ్లాండ్‌ టీమ్‌ అలా ఎందుకు అబుదాబీలో ప్రాక్టీస్‌ చేయాలని అనుకుందో అర్థం చేసుకోగలను. అక్కడి పిచ్‌లు, నెట్స్‌, సౌకర్యాలపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని కుక్ చెప్పుకొచ్చాడు.

#india-vs-england #alistair-cook #practies-match
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe