Moeen Ali: రిటైర్మెంట్ ప్రకటించిన మరో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్!

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశా. యువతరం జట్టులోకి రావాలి. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా' అని అలీ చెప్పాడు. కెరీర్‌లో 6,600 పరుగులు చేసి, 360 వికెట్లు తీశాడు.

Moeen Ali: రిటైర్మెంట్ ప్రకటించిన మరో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్!
New Update

Moeen Ali:  ఇంగ్లాండ్ స్టార్‌ క్రికెటర్ మొయిన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం 37 ఏళ్ల మొయిన్ అలీ ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశానని, యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ మేరకు ‘నాకు ఇప్పుడు 37 ఏళ్లు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సెలెక్ట్ కాలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పటికే చాలా క్రికెట్ ఆడేశా. యువతరం జట్టులోకి రావాలి. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదే సరైన సమయంగా భావిస్తున్నా’ అంటూ అలీ స్పష్టం చేశాడు.ఇక 2014లో అరంగేట్రం చేసిన మోయిన్ అలీ.. 2023 జులై 27న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు, 2023 నవంబర్ 11న పాక్‌తో చివరి వన్డే, భారత్‌తో జూన్ 27న ఆఖరి టీ20 ఆడాడు. ఇక 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లకు ప్రాతినిథ్యం వహించిన అలీ.. అన్ని ఫార్మట్లలో కలిసి 6,600 పరుగులు చేసి, 360+ వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మలన్‌.. ఇంగ్లాండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసి రికార్డ్ తనపేరుమీదే ఉంది.

#england #moeen-ali-retirement #internantional-cricket
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe