HYDRA: అక్రమకట్టడలపై హైడ్రా ఉక్కుపాదం

TG: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట, ఖానాపూర్‌లో చెరువును కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

New Update
HYDRA: అక్రమకట్టడలపై హైడ్రా ఉక్కుపాదం

HYDRA: రోజురోజుకూ అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట, ఖానాపూర్‌లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. గండిపేట చెరువు స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయాల కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు. అధికారులకు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇటీవల బాచుపల్లిలో..

ఇటీవల బాచుపల్లి ఎర్రకుంట చెరువు పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రగతినగర్‌ – బాచుపల్లి ఎర్రకుంటలో సర్వే నెంబర్‌ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. చెరువును ఆక్రమించి మాప్స్‌ కనస్ట్రక్షన్‌ నిర్మాణం జరిగింది. 1300 గజాల్లో అపార్ట్‌మెంట్‌ను ఓ సంస్థ నిర్మించింది. ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌.. బిల్డింగ్‌లను కూల్చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ ను అధికారులు నేలమట్టం చేశారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Advertisment
తాజా కథనాలు