Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..!

ఛత్తీస్‌గఢ్‌లో తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి..!
New Update

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. నారాయణపూర్ - దంతివాడ - కొండగావ్ సరిహద్దు ప్రాంతంలోని తూర్పు బస్టర్ డివిజన్ కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు.

Also Read: జగన్ ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు

నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, జగదల్‌పూర్ జిల్లాల DRG, ITBP యొక్క 45వ కార్ప్స్ చెందిన భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామ పరిధిలో తారసపడ్డ మావోయిస్టులకు, భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున మావోయిస్టు సామాగ్రి మందు గుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

#chhattisgarh #encounter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe