/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Amazon-Employee.jpg)
Amazon Employee: సంస్థకు చెందిన రూ.3.2 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు సైబారాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు. అమెజాన్‌లో సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు నిందితుడు ఎం. వెంకటేశ్వర్లు. సంస్థలో రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులను అతను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 184 మంది ఉద్యోగుల నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్ళించాడు. బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు నగదును నిందితుడు మళ్లించినట్లు సమాచారం. అవకతవకలు గుర్తించి పోలీసులకు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు ఈఏడబ్ల్యూ(ఆర్థిక నేర విభాగం) పోలీసులు.