Eluru: ఏలూరులో వైసీపీకి మరో ఎదురు దెబ్బ! ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని, మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. By Bhavana 06 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Eluru: ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా...కొద్ది రోజుల క్రితం మేయర్ దంపతులు నూర్జహాన్, పెదబాబు పార్టీని వీడారు. వీరి బాటలోనే తాజాగా జెడ్పీ ఛైర్‌పర్సన్ కూడా వచ్చి చేరారు. ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా పార్టీకి రాజీనామా చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏలూరు జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయ్యింది. మిగిలిన పార్టీ నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో పార్టీలు మారడంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పాలి. Also Read: నీట మునిగిన ఏలూరు-కైకలూరు రహదారి! #ycp #eluru మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి