అమ్మాయిల మిస్సింగ్‌ వెనకాల వాలంటీర్లు: పవన్ కళ్యాణ్

ఏపీలో రాజకీయ యుద్ద మొదలైంది. పవన్ తన విజయ యాత్ర రెండో విడతలో సీఎం జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో వేలకోట్ల అప్పుచేసి ఏం చేశామని ప్రశ్నించారు. ఇదంతా చేస్తుంటే ప్రజల తరఫున అడగటం తప్ప అన్నారు. మీరు చేసే అరాచకాలు ఢిల్లీ నుండే నిఘా వర్గాలు నాకు కొన్ని విషయాలు వెల్లడించాయన్నారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నానని నన్ను పెళ్లిళ్లు అని.. లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు.. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని విమర్శించారు.

New Update
అమ్మాయిల మిస్సింగ్‌ వెనకాల వాలంటీర్లు: పవన్ కళ్యాణ్

Elur..Volunteers behind missing girls: Pawan Kalyan

అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా..

ఏపీ సీఎం జగన్ చేస్తున్నది దిగజారుడు రాజకీయాలు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్‌లో విలువలు నిలబెట్టేలా తాను వ్యవహరిస్తుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వారాహి విజయయాత్ర రెండో విడత ఏలూరు నుంచి ప్రారంభమైన విషయం తెలసిందే. మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా.. దిగజారి మాట్లాడుతున్న జగన్‌ను ఇక నుంచి నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను అన్నారు. హోదా మరిచి దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే, గౌరవం ఇవ్వాల్సిన అగత్యం లేదని స్పష్టం చేశారు. మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరం అన్నారు పవన్ కళ్యాణ్. సీఎం పదవికి జగన్ అనర్హుడని, వైసీపీ నేతల అన్యాయం, దుర్మార్గాలపై ప్రశ్నిస్తున్నానన్న కోపంతోనే తనను పెళ్లిళ్లు అని, లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తితంగా దాడి చేయించడం అందుకు నిదర్శనం అన్నారు.

మహిళల అక్రమ రవాణా జరుగుతోంది

సమాచారమంతా వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, తద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్‌. అంతమంది ఉసురు జగన్ పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో రూ.1.25లక్షల కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తోందని అందులో 97వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తోందని, మిగతాదంతా జగన్ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ సొమ్ముతోనే ఎన్నికల్లో ఓట్లు కొనబోతున్నారని చెప్పారు. జగన్ లా తనకు అడ్డగోలు సంపాదన లేదని, ఆయన నాన్నలా తన నాన్న సీఎం కాదని, ఆయనలాగా ప్రతి పనికీ తనకు 6 శాతం కమీషన్ రాదని చెప్పారు పవన్. కష్టపడి సినిమాల్లో నటించి, వచ్చిన డబ్బుని పేదలకు, కౌలు రైతులకు పంచుతున్నానని అన్నారు పవన్. మంచి చేసేవాడు హైదరాబాద్‌లో ఉంటే ఏంటని ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు

ఏపీలో వాలంటీరు వ్యవస్థ అనేది వైసీపీ నేతలకు నిఘా వ్యవస్థ లాంటిది. ఏ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. వారు ఏం పనులు చేస్తున్నారు. ఏ పార్టీకి అనుకూలం. ఏ ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు అనే విషయాలపై వైసీపీ నేతలు నిఘా పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ సర్కార్ నెరవేర్చలేదన్నారు. మద్య పాన నిషేధం అమలు చేయలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సీఎం తమ స్థాయికి తగ్గట్లుగా వందల కోట్ల నుంచి దోచేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఏపీ ప్రజలు బుగ్గలు నిమిరేవారని కాదు, మాటపై నిలబడే వారిని నమ్మాలంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. ఏలూరులో వరద వస్తే రక్షణ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఏపీలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగడం లేదని, మరోవైపు లక్షల కోట్ల అప్పులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు.

లక్షల కోట్ల డబ్బుల ఏం చేశావు?

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిలో లోపాలను కాగ్‌ నివేదిక వెల్లడించిందన్నారు. ఏపీ ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు నగదును ఎవరి కోసం ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలకు ఏదో మేలు చేశామంటూ ప్రతిరోజు చెప్పుకునే వైసీపీ మంత్రులు, నేతలు, సీఎం జగన్.. లక్షా 18 వేల కోట్ల అప్పు గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రజలపై చేసిన అప్పులకు సీఎం జగన్‌ ప్రభుత్వం, మంత్రివర్గం జవాబు చెప్పాల్సిందే అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పదోవంతుకుపైగా వైసీపీ సర్కార్ అప్పులు తీసుకొచ్చిందని, వాటిని నిజంగానే ప్రజలకు ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవని పవన్ అభిప్రాయపడ్డారు. ఇంటిని సరిగ్గా నడపాలంటే భర్త చేసే అప్పులను భార్యకు చెప్పాల్సి ఉంటుందన్నారు. రూ.500 ఇచ్చి బిడ్డను మార్కెట్‌కు పంపిస్తే వేటికి ఎంత ఖర్చు చేశావు అని తల్లి బిడ్డను అడుగుతుంది. అయితే లక్షా 18 వేల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని పవన్ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు