Elon Musk Moon Mission: వీడు మామూలోడు కాదు.. చందమామ పైకి.. మస్క్ మూన్ ల్యాండర్..

భారత్ చంద్రయాన్ 3 స్ఫూర్తి తో ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చంద్రుని చేరుకునే ప్రయోగం చేశారు. ఇంటూటివ్ మెషీన్స్ సిద్ధం చేసిన ఒడిస్సియస్ ల్యాండర్ ( IM-1)ను మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా పంపించారు. ఇది ఈనెల 22న చందమామపై ల్యాండ్ అవుతుంది. 

New Update
Elon Musk Moon Mission: వీడు మామూలోడు కాదు.. చందమామ పైకి.. మస్క్ మూన్ ల్యాండర్..

Elon Musk Moon Mission: భారతదేశం చంద్రయాన్‌తో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలోన్ మస్క్  కూడా చంద్రునిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.  చంద్రునిపై చంద్రయాన్-3 ద్వారా  చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోని మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. ఆ సమయంలో భారతదేశం సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి ఎలోన్ మస్క్ కూడా అభిమానిగా మారిపోయాడు. దీంతో తానూ ఇలా చేయాలని అనుకున్నాడు. అంతే.. ఇప్పుడు దానిని చేసి చూపిస్తున్నాడు. ఎలోన్ మాస్క్ (Elon Musk Moon Mission)స్పేస్‌ఎక్స్ సంస్థ కూడా చంద్రునిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయబోతోంది. స్పేస్‌ఎక్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన మూన్ ల్యాండర్‌ను చంద్రుని కక్ష్యలోకి పంపింది.  హ్యూస్టన్‌లో ఉన్న ఇంటూటివ్ మెషీన్స్ ఈ మూన్ ల్యాండర్ సిద్ధం చేసింది.

ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి తొలి ప్రైవేట్ మూన్ ల్యాండర్ ప్రయోగించారు.  దీని పేరు ఒడిస్సియస్ ల్యాండర్, దీనిని IM-1 ల్యాండర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రయోగించేందుకు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 22న చంద్రుని దక్షిణ ధ్రువానికి అంటే భారతదేశపు విక్రమ్ ల్యాండర్‌ ల్యాండ్ అయిన ప్రాంతానికి దగ్గర్లోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  అంతా సవ్యంగా సాగితే చంద్రుడిపై ఓ ప్రైవేట్ కంపెనీ విజయవంతంగా అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.

రూ.980 కోట్ల డీల్
ఈ ల్యాండర్ నాసా వాణిజ్య కార్యక్రమం - లూనార్ పేలోడ్ సర్వీస్ కింద తయారు చేశారు.  దాని ప్రయోగానికి, NASA 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 980 కోట్లు) ఇంట్యూటివ్ మెషీన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా ఈ మిషన్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించాల్సి ఉంది.  కానీ విండో ఇంధన సమస్య (మీథేన్ ఉష్ణోగ్రతలో మార్పు) కారణంగా అది జరగలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న దీన్ని ప్రారంభించారు. ప్రయోగం విజయవంతమైతే, ఈ ల్యాండర్ ఫిబ్రవరి 22న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. IM-1 ఒడిస్సియస్ ప్రైవేట్ లూనార్ ల్యాండర్ మొత్తం 16 రోజుల మిషన్. చంద్రుని ఉపరితలంపై దిగిన తర్వాత, ఇది 7 రోజులు పని చేస్తుంది.

Also Read: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం తీర్పు.. అసలు ఈ బాండ్స్ ఏమిటి?

భారత్ రికార్డు పై ప్రశంసలు కురిపించిన మస్క్..
భారతదేశానికి చెందిన చంద్రయాన్ చంద్రునిపైకి వెళ్లినప్పుడు, స్పేస్‌ఎక్స్ కంపెనీ యజమాని, ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఉన్న ఎలోన్ మస్క్(Elon Musk Moon Mission), ఇంటర్‌స్టెల్లార్ చిత్రం కంటే తక్కువ బడ్జెట్‌తో భారతదేశం తన అంతరిక్ష నౌకను చంద్రునిపైకి పంపిందని ట్వీట్‌ చేశారు. భారతదేశం చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ సుమారు రూ. 620 కోట్లు ($75 మిలియన్లు) అయితే ఇంటర్స్టెల్లార్ బడ్జెట్ $165 మిలియన్లు. ఇది భారత్‌కు మంచిదని మస్క్ అన్నారు. మస్క్ ఇప్పటికే వేలాది ఉపగ్రహాల ప్రయోగాల నుంచి అంగారకుడిపై కాలనీ ఏర్పాటు వరకు భారీ ప్రణాళికను రూపొందించారు. 

Watch this Interesting Video:

Advertisment
తాజా కథనాలు