/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/elephant-kicks-women-jpg.webp)
Elephant Kicks Women: ఏనుగులు చాలా కూల్‌గా ఉంటాయి. కామ్‌గా తమ పని తాము చేసుకుపోతాయి. ఎవరైనా అడ్డొచ్చినా ఒక చూపు చూసి తొండం ఊపుకుంటూ వెళ్లిపోతాయి. అయితే ఇదంతా కాయిన్‌కు ఒకసైడ్ మాత్రమే. ఏనుగుకు కోపం వస్తే మాములగా ఉండదు. పొలాలను ధ్వంసం చేస్తాయి.. అడ్డొచ్చినవాడిని ఈడ్చిపడేస్తాయి.. తొండంతో తన్నిపడేస్తాయి. కోపంతో ఉన్నప్పుడు ఏనుగుల విశ్వరూపం చూస్తే భయం పుట్టకమానదు. ఆ సమయంలో అడవిరాజు సింహమైనా గజరాజు దెబ్బకు గజగజా వణకిపోవాల్సిందే. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చెప్పాలనిపించింది కాబట్టి.
Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/vujG89psEj
— خالد محمد (@kmajl1275) February 22, 2024
సోషల్‌మీడియాలో ట్రెండింగ్ వీడియోలకు కొదవలేదు. నిత్యం నెట్టింట అనేక వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా యనిమల్స్‌కు సంబంధించిన వీడియోలు ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. తాజాగా మరో వీడియో అలానే నిలిచింది. ప్రశాంతమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన ఏనుగులు కూడా అకస్మాత్తుగా భయంకరంగా, దూకుడుగా మారతాయి. ఓ వీడియోలో ఒక ఏనుగు ఆకులను తింటున్నట్లు కనిపిస్తుంది.
విసిరి పడేసింది:
ఒక మహిళ మొదట తన హెల్మెట్ తీసి.. అక్కడున్న కెమెరాకు ఏదో చెప్పి ఏనుగు దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో ఏనుగు ఆకులు తినడంపై దృష్టి పెట్టి ఉంది. ఏనుగు అకస్మాత్తుగా తనకు చాలా దగ్గరగా నిలబడి ఉన్న మహిళను చూసింది. మరి ఏనుగు ఏం అనుకుందో ఏమో తెలియదు కానీ తొండంతో మహిళను విసిరిపడేసింది. దీంతో షాక్ అయిన మహిళ అక్కడి నుంచి లగెత్తింది. ఏనుగు దెబ్బకు మహిళకు గాయలైనట్టుగా అర్థమవుతోంది.
Also Read: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!