Watch: జంతువులకు ఆకలేస్తే వేటాడి లేదంటే అందుబాటులో ఉన్న ఆహారం తిని ఆకలి తీర్చుకుంటాయి. కానీ కొన్నిసార్ల వాటికి ఆహారం దొరకని సందర్బాలూ ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకుంనేందుకు బీభత్సం చేస్తాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆకలితో ఉన్న ఏనుగు బియ్యం గోడౌన్ షట్టర్ ను పగులగొట్టడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అసలు విషయం ఏంటంటే కేరళ, కర్నాటక సరిహద్దులోని గుండ్లుపేట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆకలితో అలమటిస్తున్న ఏనుగు ఆహారం కోసం ప్రయత్నించినా ఎక్కడా ఆహారం దొరకలేదు. దీంతో అటు ఇటు తిరిగి జనాల్లోకి వచ్చింది. కోపంతో వస్తున్న ఏనుగును చూసిన జనాలు భయంతో పరుగులు పెట్టారు. ఎలాగైనా ఆకలి తీర్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ గోడౌన్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఎలాంటి ఆహారం కనిపించలేదు. షట్టర్లనీ మూసి ఉండటంతో కోపం రగిలిపోయిన ఏనుగు తొండంతో షట్టర్ ను ఒక్క దెబ్బ కొట్టింది. అంతే ఏనుగు దెబ్బకు షట్టర్ కూలింది. లోపలికి వెళ్లి బియ్యాని తినేసింది. తర్వాత ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది.
The Elephant knows that if there is no food in forest, it has to come to Food Corporation Of India godown to get food. 🐘 pic.twitter.com/JrzHDNE5NK
— Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) April 2, 2024
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో ఏనుగుకు ఎంతకష్టం వచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..అడవులను నరికివేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో. మీరూ చూడండి.
ఇది కూడా చదవండి: టర్కీలోని ఇస్తాంబుల్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, 29 మంది మృతి.!