సమ్మె సైరన్ మోగించిన విద్యుత్‌ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని వెల్లడించారు.

New Update
సమ్మె సైరన్ మోగించిన విద్యుత్‌ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారా..? విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగడానికి గల కారణమేంటి.? ఉద్యోగుల డిమాండ్‌లు ఏంటి..? కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందా..? సిబ్బంది ప్రతిపాధనను ప్రభుత్వం అంగీకరించలేకపోయిందా..? సమ్మె సైరన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అనేక ఇబ్బందులకు గురికాక తప్పదా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి నోటీసులు పంపిన ఉద్యోగులు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె సైరన్‌ మోగించాలని చూస్తున్నారు. రేపటి నుంచే విధులను బహిష్కరిస్తామని విద్యుత్‌ కార్మికులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందు తాము 12 రకాల డిమాండ్లను పెట్టామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. పలు దఫాలుగా చర్చలు జరిపామని అవి విఫలం కావడంతోనే సమ్మెకు దిగబోతున్నట్లు ఆయన తెలిపారు. రేపు ప్రభుత్వ సిమ్‌లను తిరిగి ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. తాము ఎప్పుడో సమ్మెకు దిగే వారిమని, పైఅధికారులు, పోలీస్‌ అధికారుల రిక్వెస్ట్‌ మేరకు సమ్మెను వాయిదా వేసినట్లు గుర్తు చేశారు.

కార్మిక చట్టాలను అమలు చేయాలని, చట్ట ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. దీంతో పాటు పొరుగు సేవల సిబ్బందికి, కాంట్రాక్టు ఉద్యోగులకు నేరుగా విద్యుత్‌ సంస్ధలే జీతాలను చెల్లించాలని, పొరుగు సేవల సిబ్బందిని విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేసి వారి సర్వీసులను క్రమబద్దీకరించాలన్నారు. 1999 నుంచి 2004 మధ్య నియమించిన ఉద్యోగులకు జీపీఎఫ్‌తో పాటు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింప జేయాలన్నారు. వారికి 121 జీవో వర్తించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ డిమాండ్‌ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పథకం కింద తక్షణమే ఉద్యోగం కల్పించాలన్నారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఎనర్జీ అసిస్టెంట్‌ సర్వీసులను క్రమబద్దీకరించాలన్నారు. జనవరి 2022 డిఏ బకాయిలతో సహా పెండింగ్‌లో ఉన్న మూడు డిఏలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయ్యాలని, ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణ 2022ని వెంటనే ఖరారు చేయాలన్నారు. ఉద్యోగుల మూల వేతనం అలవెన్స్‌ తగ్గించొద్దని, వేతన సవరణ 2022 సవరించిన పే స్కేల్‌ ఇంక్రిమెంట్ రేటు ప్రస్తుతం ఉన్న ఇంక్రిమెంట్ రేట్ కంటే ఎక్కువగా ఉండేలా చూడాలని చంద్రశేఖర్ అన్నారు.

గురువారం నుంచి విద్యుత్‌ ఉద్యోగులు సమ్మె చేపడుతామని తెల్చి చెప్పడంతో.. ప్రభుత్వం స్పందించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో మంత్రి బొత్స సత్యానారాయణ, సీఎస్‌, పాల్గొన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగులతో చర్చించి వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని తెలిపారు. కాగా బుదవారం మధ్యాహ్నం విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెపై సబ్‌ కమిటి సీఎంతో చర్చించింది. సీఎం ఆదేశం మేరకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు