Current : మండే ఎండలతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్! మే నెల రాకముందే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది మే నెల మధ్యలో వాడిన విద్యుత్ వినియోగం ఈ ఏడాది మార్చి నెలలోనే వాడటంతో మార్చి 8 వ తేదీనే 15, 623 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. By Bhavana 30 Mar 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Current Demand : మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు(Summer) మాడు పగలగొడుతున్నాయి. మే నెల రాకముందే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం(Electric Usage) విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది మే నెల మధ్యలో వాడిన విద్యుత్ వినియోగం ఈ ఏడాది మార్చి నెలలోనే వాడటంతో మార్చి 8 వ తేదీనే 15, 623 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఎండలు మండుతుండడంతో పాటు వరుస సెలవులు కారణంగా అందరూ ఇంటిపట్టునే ఉండడంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఎక్కువైంది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) లో 15 శాతం డొమెస్టిక్ విద్యుత్ ను వినియోగిస్తున్నారు. వ్యవసాయానికి కూడా విద్యుత్ డిమాండ్ ఆమాంతం పెరిగింది. చెరువులు, వాగులు ఎండిపోయాయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు(Farmers) విద్యుత్ మోటార్ల మీద ఆధారపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రానున్న రోజుల్లో విద్యుత్ కు డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది మార్చిలో గ్రేటర్ అత్యధిక విద్యుత్ వినియోగం 67. 97 మిలియన్ యూనిట్లు మాత్రమే. కాగా గత గురువారం గ్రేటర్ లో 79. 48 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. Also Read : పీవీకి భారత్ రత్న… అందుకున్నది ఎవరో తెలుసా #greater-hyderabad #electric-power #current-demand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి