Elections 2024 6th Phase: ప్రశాంతంగా సాగుతున్న 6వ దశ పోలింగ్ ఉదయం 9 గంటల వరకూ ఓటింగ్ ఎంతంటే.. 

లోక్‌సభ ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకూ 10.82% ఓటింగ్ నమోదు అయింది. 

New Update
Elections 2024 6th Phase: ప్రశాంతంగా సాగుతున్న 6వ దశ పోలింగ్ ఉదయం 9 గంటల వరకూ ఓటింగ్ ఎంతంటే.. 

Lok Sabha Elections 2024 6th Phase: లోక్‌సభ ఎన్నికల 2024 దశ 6 ఓటింగ్ చురుకుగా సాగుతోంది.  ఆరవ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఆరో విడతలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆరో దశలో ఉత్తరప్రదేశ్‌లోని 14, హర్యానాలోని 10, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లోని 4, జమ్మూకశ్మీర్‌లోని ఒక స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

Elections 2024 6th Phase; ఆయాస్థానాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటలవరకూ 10.82% ఓటింగ్ నమోదు అయింది. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తరువాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్రాల్లో పోలింగ్ భారీగా నమోదు అవుతోంది.

Also Read: ప్రారంభమైన ఆరోదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ 

రాష్ట్రాల వారీగా 9 గంటల వరకూ పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.. 

  • ఢిల్లీ - 8.94%
  • ఉత్తర ప్రదేశ్ - 12.33%
  • హర్యానా - 8.31%
  • బీహార్- 9.66
  • జమ్మూ కాశ్మీర్ - 8.89%
  • జార్ఖండ్- 11.74%
  • ఒడిశా - 7.43%
  • పశ్చిమ బెంగాల్ - 16.54%

Elections 2024 6th Phase: ఇక ఈ దశలో మనోజ్ తివారీ, మెహబూబా ముఫ్తీ, కన్హయ్య కుమార్‌లతో సహా పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు