Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. 

ఎన్నికల ప్రచారం కోసం పార్టీల రోడ్ షోల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది.   ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయాల్లో రోడ్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. 

Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. 
New Update

Election Rules : ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు నిర్వహించే రోడ్ షోలకు అనుమతులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌(Vikas Raj) కీలక ప్రకటన చేశారు. సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో మాత్రమే రోడ్ షో(Road Show) లకు అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నిల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లను మీడియాకు సోమవారం ఆయన వివరించారు. నిజానికి ఇతర సమయాలలో రోడ్ షోల పై నిషేధం లేదు. కానీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు గానూ అనుమతి(Election Rules) ఇవ్వలేమని తెలిపారు. ఇక ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ట్రామాకేర్ సెంటర్లు ఉన్న ప్రదేశాల్లో కూడా రాడ్ షోలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. 

కొత్త ఓటర్లకు అప్పటివరకూ అవకాశం.. 

ఇప్పటికీ ఓటర్లు(Voters) గా నమోదు కాని వారు ఏప్రిల్ 15 వరకూ ఓటరు నమోదు చేసుకోవచ్చని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఫారం-6 లో అప్లై చేసుకున్నవారందరికే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. అయితే, చిరునామా మార్పు, కరెక్షన్స్ మాత్రం ఎన్నికల(Election Rules) తరువాత మాత్రమే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా 12 లక్షల కొత్త ఓటర్లు నమోదు అయ్యారనీ, 8,58,491 ఓటర్లను తొలగించామని చెప్పారు. మొత్తం 30 లక్షల బోగస్ ఓట్లను గత రెండున్నరేళ్లలో తొలగించామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాద్ పాత బస్తీలో బోగస్ ఓట్లున్నట్టు ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ చేశారని చెప్పారు. అక్కడ నుంచి రిపోర్ట్ అందిన తరువాత దానిని బట్టి చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్‌వివరించారు.

Also Read: జాగ్రత్త.. ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్!

అంతకంటే ఎక్కువ నగదు ఉంటే.. 

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు క్యారీ చేసే విషయంలో నిబంధనలు(Election Rules) పాటించాలని వికాస్‌రాజ్‌ సూచించారు. ఎట్టిపరిస్థితిలోనూ 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా ఎక్కువ నగదుతో దొరికితే చట్టప్రకారం చర్యలుంటాయని(Election Rules) హెచ్చరించారు. అలాగే,  ఈ నెల (మార్చి) ప్రారంభం నుంచి ఇప్పటివరకూ (ఆదివారం) రూ.21.63 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ముగిసిన దగ్గర నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లు విలువైన నగదును సాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

పగడ్బందీగా ఏర్పాట్లు.. 

రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్(Election Commission) అన్నిరకాలుగాను పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఓటర్లు స్వేఛ్చగా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి కాలం కావడంతో పోలింగ్ బూత్ ల వద్ద మంచినీటి ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఓటర్లకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 

#lok-sabha-elections-2024 #cec #road-show
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe