BREAKING: అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు!

కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. తమకు వచ్చిన ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. రేపు సాయంత్రం 5గంటల వరకు వివరాలు అందించాలని ఆదేశించింది.

New Update
BREAKING: అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. తమకు వచ్చిన ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ వివరాలు అందించాలని నోటీసులు ఈసీ పంపింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు పార్టీకి అందిన ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు నోటీసులు పంపించింది. ఈనెల 2న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఈనెల 3వ తేదీన తొలుత ఈసీ నోటీసులు ఇచ్చింది.

ALSO READ: కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద.. ఆ 12 మంది మాట వింటారా?

తెలంగాణలో ఏరులై పారుతున్న నోట్ల కట్టలు:

తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని నోట్ల కట్టలు బయటకొస్తున్నాయి. తెలంగాణలో కోట్లాది రూపాయలను అక్రమంగా వేర్వేరు మార్గాల్లో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి మరీ పట్టుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు స్వాధీనం అయిన మొత్తం రూ.571.80 కోట్లు అని పోలీసులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లోనే మొత్తం రూ.12.88 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు