Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' సినిమాకి ఎలక్షన్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిర్మాత పోస్ట్! 'కల్కి' సినిమాకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్స్ వల్ల తన సినిమా పనులు ఆగిపోయాయని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతతో మాట్లాడుతున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 11 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Election Effect For Kalki 2898AD : ప్రభాస్(Prabhas) – నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్లో ‘కల్కి 2898AD’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భాగం అవుతున్నారు. ప్రభాస్ తో పాటూ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని, నాగార్జున గెస్ట్ రోల్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటె కల్కి సినిమాకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్స్ వల్ల తన సినిమా పనులు ఆగిపోయాయని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతతో మాట్లాడుతున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. Also Read : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్! 'కల్కి' కి ఎలక్షన్స్ ఎఫెక్ట్ 'కల్కి' నిర్మాతలలో ఒకరైన స్వప్నదత్ తాజాగా 'కరెంట్ ఎఫైర్స్ ఆఫ్ వైజయంతి' అంటూ తనకి, నాగ్ అశ్విన్ కి మధ్య జరిగిన సంభాషణను ఇన్ స్టా పోస్ట్ లో రాసుకొచ్చారు." కల్కి సీజీ వర్క్ చేస్తున్న వాళ్లంతా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా?అని నాగ్ అశ్విన్ అనగా..'ఎవరు గెలుస్తారేంటి' అని స్వప్న దత్ అడిగారు. దానికి నాగ్ అశ్విన్.."ఎవరు గెలిస్తే నాకెందుకండీ.. నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురుచూస్తున్నా" అంటూ సరదాగా బదులిచ్చాడు. దీన్ని బట్టి కల్కి సీజీ వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉందని స్పష్టమవుతుంది. మే 9 న విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల జూన్ 27 కి వాయిదా వేశారు. ఆలోగా గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ అంతా పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది. సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. #prabhas #kalki-2898ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి