Breaking: ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ఊహగానాలు ఊపందుకున్నాయి. 2027 వరకూ ఆయనకు పదవికాలం ఉన్నప్పటికీ ముందే ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారనే విషయం తెలిసిందే. కాగా అరుణ్ గోయల్ రాజీనామా కంటే ముందే సంఘంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో ఎన్నికల కమీషన్ తీసుకోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. 1985 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన అరుణ్ గోయల్.. నవంబర్ 2022 న భారతదేశ ఎన్నికల కమీషనర్ (EC)గా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రభుత్వంలో, అతను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. లూథియానా జిల్లా (1995-2000) మరియు భటిండా జిల్లా (1993-94) జిల్లా ఎన్నికల అధికారిగా వివిధ లోక్‌సభ, విధానసభ ఎన్నికలను సజావుగా నిర్వహించారు.