నిన్న ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంటుతో పాటు అసెంబీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల సందర్భంగా నిన్న ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నాందెడ్ నుంచి ఏపీకి వస్తున్న ఓ ట్రైన్‌లో విశాఖపట్నంకు చెందిన 2 వేల మంది ఓటర్లు ఉన్నారనే సమాచారం తెలియడంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైలు సాయంత్రం 5.17 PM గంటలకు విశాఖకు చేరుకునేలా ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం రైల్వే అధికారులతో మాట్లాడి విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేసింది.
Also Read: సత్తెనపల్లిలో రీపోలింగ్ పెట్టాల్సిందే.. ఈసీకి మంత్రి అంబటి సంచలన డిమాండ్
పోలింగ్ ముగిసే సమయానికి 40 నిమిషాల ముందు 2 వేల మంది విశాఖకు చేరుకునేందుకు ఈ గ్రీన్ ఛానెల్ కీలకంగా పనిచేసింది. దీనివల్ల విశాఖలోని వివిధ నియోజకవర్గాల్లో సుమారు 2 వేల మందికి ఓటు వేసే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంది.
Also Read: ఉండిలో ఉత్కంఠ రేపుతోన్న పోలింగ్ లెక్కలు.. RRR గెలుస్తాడా?