DK Aruna as Gadwala MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించడం పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణను ప్రకటిస్తూ..అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో రాజకీయ నేతలు కొందరు ఆమె ఎన్నికను వ్యతిరేకించారు. దీంతో ఆమె మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
దీంతో ఆమెను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ కొన్ని అభ్యంతరాలు వెలువడడంతో ఆమె కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని పేర్కొంది.
ఈ తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. తెలంగాణ సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది. ఈ మేరకు తెలంగాణ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.
ఈ క్రమంలో డీకే అరుణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని తెలుస్తుంది. అరుణ పై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో ఆయనను అనర్హుడిగా ప్రకటించింది.
Also Read: సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నారా? ఆ ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తారా?