BIG BREAKING: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.

New Update
Telangana: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నిరంజన్

Rajya Sabha Elections: తెలంగాణలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ. సెప్టెంబర్ 3నఈ ఎన్నిక జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాలకు షెడ్యూల్ ను విడుదల చేసింది.

కాంగ్రెస్ కి మరో సీటు..

రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగనుంది. మరో సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీఆర్ఎస్ కు చేజారిపోయింది. రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఒక సీటు తగ్గనుంది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ స్థానం కాంగ్రెస్ కు దక్కనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు