EC On Zero Tolerance Towards Use of Children: ఎన్నికల సంఘం(సీఈసీ) రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రచార సమయంలో ఏ పార్టీ కూడా పిల్లలను చేర్చుకోకుండా నిషేధించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి ఈసీ (Election Commission) ఈ సూచనలు చేసింది. వికలాంగుల పట్ల కూడా సానుభూతి చూపాలని ఆదేశించింది. రాజకీయ పార్టీలు పిల్లలను 'ఏ రూపంలోనైనా' ఉపయోగించకూడదని తేల్చి చెప్పింది. పోస్టర్లు/కరపత్రాలు పంపిణీ చేసినా లేదా నినాదాలు.. ప్రచార ర్యాలీలు చేసినా.. ఎన్నికల సమావేశాలలో పాల్గొన్నా.. ఏదైనా సరే పిల్లలను ఇన్‌వాల్వ్ చేయవద్దని తెలిపింది.
అసలు నిమగ్నం చేయవద్దు:
ర్యాలీలు, నినాదాలు చేయడం, పోస్టర్లు లేదా కరపత్రాల పంపిణీ, ఎన్నికలకు సంబంధించిన ఏదైనా ఇతర కార్యకలాపాలతో సహా ఎన్నికల ప్రచారాలలో పిల్లలను (Children) నిమగ్నం చేయవద్దని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు స్పష్టంగా సూచించింది ఈసీ. రాజకీయ నాయకులు, అభ్యర్థులు పిల్లలను తమ చేతుల్లో పట్టుకోవడం లేదా ప్రచార కార్యక్రమాలలో (Election Campaigns) భాగంగా ప్రదర్శించడం లాంటి వాటితో సహా ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించకూడదని కమిషన్ కుండబద్దలు కొట్టింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ చిహ్నాల ప్రదర్శన లాంటి వాటికి కూడా పిల్లలను ఉపయోగించవద్దని ఆదేశించింది. ముఖ్యంగా మైనర్ (Minors) పిల్లలను ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
ఎన్నికల ప్రక్రియలో నైతిక ప్రమాణాలు, న్యాయమైన పద్ధతులను కొనసాగించేందుకు ఈసీఐ(ECI) చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ ఆదేశాలు వచ్చాయి. ప్రచారంలో పిల్లలను ఉపయోగించకుండా కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా, దేశంలో స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల ప్రజాస్వామ్య విలువలతో పాటు వాటి సూత్రాలను పరిరక్షించడాన్ని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: ఆదిలాబాద్ జిల్లాకు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలి.. కాంగ్రెస్ సీనియర్ నేతలు..!
WATCH: