Elections Notification Release : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) తొలిదశ పోలింగ్(Poling) కు సంబంధించిన నోటిఫికేషన్(Notification) బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం(CEC) విడుదల చేసింది.ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు మార్చి 27 చివరి తేదీ కాగా.. బీహార్ లో 27 న పండుగ ఉండడంతో వారికి 28 వరకు ఈసీ అవకాశం ఇచ్చింది.
మార్చి 28 న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్ లో మాత్రమే మార్చి 30న ఉంటుందని అధికారులు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 వరకు గడువు ఉండగా.. బీహార్(Bihar) లో మాత్రం ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుందని ఈసీ వివరించింది. . ఈ నోటిఫికేషన్‌తో లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమౌతున్నట్లు అధికారులు వివరించారు.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), సిక్కిం(Sikkim), అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh), ఒడిశా(Odisha) అసెంబ్లీలతో పాటు లోక్‌సభ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న తొలిదశ పోలింగ్ కు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. ఈ నెల 27 వరకూ నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంటుంది.
30 వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. తొలిదశ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు లోని 39 స్థానాలకు తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. మొత్తం 80 స్థానాలున్న యూపీలో 8 స్థానాలకు , మధ్యప్రదేశ్ 6, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ 5, మధ్యప్రదేశ్ 6 స్థానాకలు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి.
బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్‌గడ్, అండమాన్ , జమ్ము కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ షెడ్యూల్
మార్చి 20 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
మార్చి 20 నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతాయి
మార్చి 27 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
మార్చి 28 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
మార్చి 30 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
ఏప్రిల్ 19 పోలింగ్(Poling) జరగనుంది.
దేశంలో మొత్తం 96 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురుషులు 49 కోట్లు, మహిళలు 47కోట్లు, కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు ఏర్పాటు చేయగా..10లక్షల 50వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ఎన్నికల కోసం కోటి 50లక్షల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం…లోయలో పడిన టెంపో..ముగ్గురు మృతి..!