AP Voter List: ఆంధ్ర ప్రదేశ్ లోని ఓటర్ల జాబితా ప్రకటన చేశారు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) అధికారి రాజీవ్ కుమార్ (Rajiv Kumar). కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ పర్యాటనలో ఉంది. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సీఈసీ రాజీవ్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏపీలో ఎంపీ (MP Elections), అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం అని అన్నారు. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ALSO READ: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్
ఓటు హక్కు వినియోగించుకోవాలి..
వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు రాజీవ్ కుమార్. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం అన్నారు. నిన్న విజయవాడ లో పార్టీలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
పార్టీల ఆందోళన...
ఓటర్ల జాబితా లో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని రాజీవ్ కుమార్ తెలిపారు. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందని అన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందన్నారు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం అని స్పష్టం చేశారు.
ఏపీ ఓటర్లు @ 4.07 కోట్లు...
ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామం అని అన్నారు.
* మహిళా ఓటర్లు 2.07 కోట్లు,
* పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు
* ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం
* వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారు
* తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు ఉన్నారని పేర్కొన్నారు.
20 లక్షలకుపైగా ఓట్లు తొలిగింపు..
గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని అన్నారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం అని అన్నారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిథిలో 870 మంది ఓటర్లు.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయని అన్నారు. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉందని తెలిపారు. ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు